This changing weather, protect your family with big discounts! Use code: FIRST10This changing weather, protect your family with big discounts! Use code: FIRST10
ADDED TO CART SUCCESSFULLY GO TO CART
Track your pregnancy journey

గర్భధారణ సమయంలో మూత్రంలో ల్యూకోసైట్స్: కారణాలు, లక్షణాలు, చికిత్స | Leukocytes In Urine During Pregnancy: Symptoms, Causes, & Treatment in Telugu

Pregnancy
Written by - Sri Lakshmiచివరిగా నవీకరించబడింది: Nov 3, 2023
గర్భధారణ సమయంలో మూత్రంలో ల్యూకోసైట్స్: కారణాలు, లక్షణాలు, చికిత్స | Leukocytes In Urine During Pregnancy: Symptoms, Causes, & Treatment in Telugu
Read time8 min

అంటువ్యాధులు, ఇతర వ్యాధుల నుంచి శరీరాన్ని రక్షించడానికి ల్యూకోసైట్స్ లేదా తెల్ల రక్త కణాలు (WBC) మానవ శరీరంలో బాధ్యత వహిస్తాయి. మానవుల రోగనిరోధక వ్యవస్థలో ఇవి ఓ భాగం. రక్షణలా పనిచేస్తాయి. కానీ గర్భవతుల విషయానికి వస్తే, మూత్రంలో ల్యూకోసైట్స్ కనిపించడం ఆందోళన చెందాల్సిన అంశం. గర్భవతుల మూత్రంలో ల్యూకోసైట్స్ కనిపించడానికి కారణం, ఆమె శరీరం వాటిని ఎక్కువగా ఉత్పత్తి చేస్తుండటమే. ఇది సాధారణమే. చాలావరకు కేసుల్లో ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అయితే ల్యూకోసైట్స్ స్థాయి 5 (WBS/HPF) వరకు కంగారుపడాల్సిన అవసరం లేదు. కానీ మూత్రంలో ల్యూకోసైట్స్ ఎక్కువగా ఉండటం మూత్రనాళాల ఇన్ఫెక్షన్‌కు దారితీస్తుంది. గర్భధారణ సమయంలో మూత్రంలో ల్యూకోసైట్స్ రావడానికి గల కారణాలు, లక్షణాలు, చికిత్స గురించి ఈ ఆర్టికల్ చదివి తెలుసుకోండి.

గర్భవతిలో మూత్రంలో ల్యూకోసైట్స్ అంటే ఏంటీ? (What do leukocytes in urine during pregnancy mean in Telugu)

ఇన్ఫెక్షన్లపై పోరాడేందుకు శరీరం ల్యూకోసైట్స్ లేదా తెల్ల రక్త కణాలను ఉత్పత్తి చేస్తుంది. తెల్ల రక్త కణాల్లో లింఫోసైట్స్, న్యూట్రోఫిల్స్, బాసోఫిల్స్, ఇయోసినోఫిల్స్ ఉంటాయి. వీటన్నింటితో తయారయ్యే తెల్ల రక్త కణాలు శరీరాన్ని వ్యాధుల నుంచి, ఇతర రోగాల నుంచి రక్షిస్తాయి. అయితే, వాపు లేదా మూత్రనాళాల ఇన్ఫెక్షన్స్ (UTIs) ఉన్నట్లు అయితే, గర్భవతులు మూత్రంలో ల్యూకోసైట్స్ స్థాయి తెలుసుకునేందుకు మూత్ర పరీక్ష చేయించుకోవాలి. ఇది శరీరంలో కనిపించకుండా ఉన్న ఏదైనా ఇన్ఫెక్షన్ లేదా మంటను గుర్తించడానికి సాయపడుతుంది.

గర్భధారణ సమయంలో ల్యూకోసైట్స్‌కి గల కారణాలు (Causes of leukocytes in urine during pregnancy in Telugu)

బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్, మూత్రాశయంలో ఇబ్బందులు లేదా డయాబెటిస్ లాంటి కొన్ని కారణాల వల్ల గర్భవతుల్లో మూత్రంలో ల్యూకోసైట్స్ కనిపిస్తాయి. గర్భధారణ సమయంలో మూత్రంలో ల్యూకోసైట్స్ కనిపించడానికి గల సాధారణ కారణాలు ఇవే:

1. ట్రైకోమోనియాసిస్ (Trichomoniasis)

ఇది లైంగికంగా సంక్రమించే అంటువ్యాధుల్లో ఒకటి. ట్రైకోమోనాస్ వేజినాలిస్ అనే పరాన్న జీవి వల్ల ఈ ఇన్ఫెక్షన్ సోకుతుంది. గర్భవతుల్లో మూత్రంలో ల్యూకోసైట్స్ కనిపించడానికి, ఒక వ్యక్తి నుంచి మరొకరికి సోకడానికి కారణం అవుతుంది.

2. మూత్ర నాళాల ఇన్ఫెక్షన్ (Urinary Tract Infection) (UTI)

మూత్రనాళాల ఇన్ఫెక్షన్ వల్ల కూడా తెల్ల రక్తకణాలు పెరుగుతాయి. మూత్రనాళాల ఇన్ఫెక్షన్ కారణంగా పెరిగిన తెల్ల రక్తకణాలను యూరిన్ టెస్ట్ ద్వారా గుర్తించవచ్చు.

3. లక్షణాలు లేని బ్యాక్టీరియూరియా (Asymptomatic bacteriuria)

ఎలాంటి లక్షణాలు లేకుండా మూత్రంలో బ్యాక్టీరియా ఉండొచ్చు. గర్భవతుల్లో మూత్రంలో ల్యూకోసైట్స్ పెరగడానికి ఇది కారణం కావచ్చు. ఫలితంగా మూత్రనాళాల ఇన్ఫెక్షన్ ఏర్పడుతుంది.

4. పైలోనెఫ్రిటిస్ (Pyelonephritis)

ఇది కిడ్నీలకు వచ్చే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్. గర్భధారణ సమయంలో మూత్రంలో ల్యూకోసైట్ కనిపించడానికి ఇది కూడా ఓ కారణం. బ్యాక్టీరియా మూత్రాశయం నుంచి కిడ్నీలకు చేరుతుంది. వాపు, ఇన్ఫెక్షన్‌కు దారితీస్తుంది.

5. జననేంద్రియ అంటువ్యాధులు (Genital infections)

గర్భధారణ సమయంలో బ్యాకీరియల్ వేజినోసిస్, వేజినైటిస్, వేజినల్ యీస్ట్ ఇన్ఫెక్షన్ లాంటి జననేంద్రియ అంటువ్యాధులు రావడం సాధారణం. హార్మోన్ల హెచ్చుతగ్గులు ఈ పరిస్థితికి మూలం. మూత్రంలో తెల్ల రక్తకణాలు కనిపించే ప్యూరియాకు ఇది కారణం అవుతుంది.

6. సిస్టైటిస్ (మూత్రాశయ నొప్పి) (Cystitis) (bladder inflammation)

గర్భవతికి సిస్టైటిస్ ఉంటే, ఆమె మూత్రవిసర్జన చేస్తున్న సమయంలో నొప్పి లేదా మంటగా అనిపించవచ్చు. సిస్టైటిస్ కారణంగా మూత్రంలో తెల్లరక్తకణాలు పెరుగుతాయి.

గర్భవతిగా ఉన్నప్పుడు మూత్రంలో తెల్ల రక్త కణాల లక్షణాలు (Symptoms of white blood cells in urine during pregnancy in Telugu)

గర్భధారణ సమయంలో ల్యూకోసైట్స్ లక్షణాలు, అందుకు గల కనిపించని కారణాలపై ఆధారపడి ఉంటాయి. సాధారణంగా కనిపించే కారణాలు ఇవి:

  • మూత్రవిసర్జన సమయంలో నొప్పి లేదా మంటగా అనిపించడం.
  • తరచూ మూత్రవిసర్జనకు వెళ్లడం
  • మూత్రం తెల్లగా లేదా రక్తంతో కనిపించడం.
  • వికారం లేదా వాంతులు.
  • జ్వరం లేదా చలి (తీవ్రమైన పరిస్థితుల్లో)
  • బిగుసుకుపోవడం
  • వెన్ను దిగువ భాగంలో నొప్పి (ముఖ్యంగా కిడ్నీలకు ఇన్ఫెక్షన్ సోకినప్పుడు)

గర్భధారణ సమయంలో మూత్రంలో ల్యూకోసైట్స్ నిర్ధారణ (Diagnosis of leukocytes in urine during pregnancy in Telugu)

గర్భధారణ సమయంలో మూత్రంలో ల్యూకోసైట్స్‌ని మూత్ర పరీక్ష ద్వారా నిర్ధారిస్తారు. మూత్రంలో ల్యూకోసైట్స్ గుర్తించడానికి సాధారణంగా ఉపయోగించే మార్గాలు:

1. యూరిన్ డిప్‌స్టిక్ టెస్ట్ (Urine dipstick test)

ఈ పరీక్షలో చిన్న పేపర్‌ను మూత్రంలో ముంచుతారు. మూత్రంలో ల్యూకోసైట్స్ ఉంటే, పేపర్‌పై ఉన్న కెమికల్స్ కారణంగా పేపర్ స్ట్రిప్ రంగు మారుతుంది.

2. నెగిటివ్ టెస్ట్ (Negative test)

ఒకవేళ పేపర్ స్ట్రిప్స్ రంగు మారకపోతే, మూత్రంలో ల్యూకోసైట్స్ లేవని అర్థం చేసుకోవచ్చు.

3. పాజిటివ్ టెస్ట్ (Positive test)

ఒకవేళ 30 సెకండ్ల నుంచి 2 నిమిషాల్లో (బ్రాండ్‌ని బట్టి) పేపర్ స్ట్రిప్ కలర్ మారితే, మూత్రంలో ల్యూకోసైట్స్ ఉన్నట్టు.

4. ల్యూకోసైట్ ఎస్టేరేస్ యూరిన్ డిప్‌స్టిక్ టెస్ట్ (Leukocyte Esterase Urine Dipstick Test)

ఈ టెస్ట్ కూడా యూరిన్ డిప్‌స్టిక్ టెస్ట్ లాగానే చేస్తారు. ఇందులో మూత్రంలో ల్యూకోసైట్ ఎస్టేరేస్‌ను కొలుస్తారు.

5. మూత్రం శాంపిల్ తీసుకోవడం (Leukocyte Esterase Urine Dipstick Test)

మూత్రం శాంపిల్ తీసుకొని, ల్యూకోసైట్స్ ఉన్నాయో లేదో పరీక్షిస్తారు. ఈ పరీక్ష ద్వారా శరీరంలో కనిపించకుండా ఇన్ఫెక్షన్‌ని లేదా మంటను గుర్తించవచ్చు.

మీకు ఇది కూడా నచ్చుతుంది: మూత్రంలో ఎపిథీలియల్ కణాలు

గర్భవతి మూత్రంలో తెల్ల రక్త కణాలు కనిపిస్తే చేసే చికిత్స (Treatment of elevated white blood cells in urine during pregnancy in Telugu)

  • బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కారణంగా గర్భవతిలో మూత్రంలో ల్యూకోసైట్స్ కనిపిస్తే యాంటీబయాటిక్స్ చికిత్స అందిస్తారు. కనిపించకుండా ఉన్న కారణాన్ని బట్టి యాంటిబయాటిక్ రకం ఆధారపడి ఉంటుంది. పరిస్థితికి తగ్గట్టుగా వైద్యులు యాంటీబయాటిక్‌ను సూచించవచ్చు.
  • గర్భవతిలో మూత్రంలో ల్యూకోసైట్స్ ఉన్నట్టైతే, జీవనశైలిలో మార్పులు, ఎక్కువగా ద్రవపదార్థాలు తీసుకోవడం, కెఫైన్, ఆల్కహాల్ తీసుకోకపోవడం లాంటి చిన్నచిన్న మార్పుల ద్వారా ఈ సమస్య తగ్గించవచ్చు.
  • కొన్ని కేసుల్లో, వైద్యులు నొప్పి, మంట, లేదా ఇన్ఫెక్షన్లకు కారణమయ్యే లక్షణాలను తగ్గించడానికి కొన్ని మందుల్ని వైద్యులు సూచించవచ్చు.

గర్భవతి మూత్రంలో తెల్ల రక్త కణాల వల్ల పొంచి ఉన్న ప్రమాదాలు (Risks of elevated white blood cells urine during pregnancy in Telugu)

గర్భధారణ సమయంలో మూత్రంలో ల్యూకోసైట్స్ ఉంటే ఈ కింది ప్రమాదాలు రావొచ్చు:

  • కొరియోఅమ్నియోనైటిస్
  • రక్తహీనత
  • మెటర్నల్ సెప్సిస్
  • ప్రీ-ఎక్లంప్సియా
  • ముందస్తు ప్రసవం

ఈ పరిస్థితి వల్ల గర్భంలోని పిండం కూడా ఇబ్బందులు ఎదుర్కోవచ్చు. అవేంటంటే:

  • టాచీకార్డియా
  • మానసిక మాంద్యం
  • అభివృద్ధిలో ఆలస్యం
  • ప్రసవానంతర మరణాలు
  • తక్కువ బరువుతో జన్మించడం
  • ముందస్తు ప్రసవం
  • ఎదుగుదలలో పరిమితులు
  • శిశువు చనిపోయి పుట్టడం

గర్భవతి మూత్రంలో తెల్ల రక్త కణాలు పెరగకుండా నివారణ మార్గాలు (Prevention of elevated white blood cells in urine during pregnancy in Telugu)

గర్భవతిగా ఉన్నప్పుడు మూత్రంలో ల్యూకోసైట్స్ పెరగకుండా పాటించాల్సిన నివారణ మార్గాలు:

  • సరైన శుభ్రతను పాటించాలి. తరచూ స్నానం చేస్తూ ఉండాలి. జననాంగంలోని ప్రాంతాన్ని శుభ్రంగా ఉంచాలి.
  • బ్యాక్టీరియాను బయటకు పంపేందుకు కావాల్సినంతగా ద్రవపదార్థాలు తీసుకోవాలి.
  • కెఫైన్, ఆల్కహాల్ లాంటి డ్రింక్స్ తీసుకోకూడదు.
  • కాటన్ లోదుస్తులు, గాలి ఆడేలా ఉంటే వస్త్రాలు ధరించాలి.
  • జననాంగాలపై స్ప్రే, సువాసన ఉత్పత్తుల్ని ఉపయోగించకూడదు.
  • కనిపించకుండా ఉన్న ఇన్ఫెక్షన్స్‌ని గుర్తించి చికిత్స తీసుకోవాలి.
  • వైద్యులు సూచించిన అన్నిరకాల మందుల్ని వాడాలి.

ఇన్ఫెక్షన్ లేదా మూత్రంలో ల్యూకోసైట్స్ పెరుగుతున్నట్టు ఏవైనా లక్షణాలు ఉంటే వైద్యుల్ని సంప్రదించాలి. ముందుగానే ఈ సమస్యను నిర్ధారించడం, సరైన చికిత్స అందించడం ద్వారా గర్భధారణలో ఏర్పడే సమస్యల్ని నివారించవచ్చు.

References

1. Dockree S, Shine B, Pavord S, Impey L, Vatish M. (2021). White blood cells in pregnancy: reference intervals for before and after delivery. EBioMedicine.

2. Wu K, Gong W, Ke HH, Hu H, Chen L. (2022). Impact of elevated first and second trimester white blood cells on prevalence of late-onset preeclampsia. Heliyon.

3. Mårdh PA, Novikova N, Niklasson O, Bekassy Z, Skude L. (2003). Leukocyte esterase activity in vaginal fluid of pregnant and non-pregnant women with vaginitis/vaginosis and in controls. NCBI

Tags

What is leukocytes in Telugu, What are the cause of leukocytes in Telugu, What are the symptoms of leukocytes in urine in Telugu, What is White Blood Cells in urine in Telugu, What are the treatments of leukocytes in Telugu, WBC Count in Pregnancy in English, Leukocytes In Urine During Pregnancy in Hindi, Leukocytes In Urine During Pregnancy in Tamil, Leukocytes In Urine During Pregnancy in Bengali

Article Posted Under

Related Articles

Related Topics

Medical Disclaimer

This content is for informational purposes only and should not replace professional medical advice. Consult with a physician or other health care professional if you have any concerns or questions about your health. If you rely on the information provided here, you do so solely at your own risk.

foot top wavefoot down wave

AWARDS AND RECOGNITION

Awards

Mylo wins Forbes D2C Disruptor award

Awards

Mylo wins The Economic Times Promising Brands 2022

AS SEEN IN

Mylo featured on Business World
Mylo featured on CNBC
Mylo featured on Financial express
Mylo featured on The Economics Times
Mylo featured on Business Today
Mylo featured on Business World
Mylo featured on CNBC
Mylo featured on Financial express
Mylo featured on The Economics Times
Mylo featured on Business Today
Mylo featured on TOI
Mylo featured on inc42
Mylo featured on Business Standard
Mylo featured on YourStory
Mylo featured on ANI
Mylo Logo

Start Exploring

wavewave
About Us
Mylo_logo
At Mylo, we help young parents raise happy and healthy families with our innovative new-age solutions:
  • Mylo Care: Effective and science-backed personal care and wellness solutions for a joyful you.
  • Mylo Baby: Science-backed, gentle and effective personal care & hygiene range for your little one.
  • Mylo Community: Trusted and empathetic community of 10mn+ parents and experts.